Gold and Silver Price Today in Hyderabad: నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు స్వల్పంగా మాత్రమే తగ్గాయి. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరగగా.. నేడు రూ.100 మాత్రమే తగ్గింది. 24 క్యారెట్లపై నిన్న 410 పెరగ్గా.. ఈరోజు రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,150గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050గా.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.73,150గా ఉంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని డిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా.. 24 క్యారెట్ల ధర రూ. 73,300గా ఉంది. ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రూ.67,050గాను.. 24 క్యారెట్ల ధర రూ.73,150గాను ఉంది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Duleep Trophy 2024: శుభమాన్ గిల్ స్థానంలో తెలుగు ఆటగాడు.. ఎట్టకేలకు ఇషాన్ కిషన్‌కు చోటు!
మరోవైపు వెండి ధర దిగి వచ్చినట్లే దిగి వస్తూ.. మళ్ళీ పెరుగుతోంది. వరుసగా మూడు రోజులు పెరిగిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.86,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.91,500గా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు కిలో వెండి రూ.84,000గా ఉంది.