ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. తులం బంగారం లక్షా 10 వేల పైనే ఉంది. అయితే పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. గోల్డ్ రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. శనివారం స్వల్పంగా తగ్గిన పసిడి.. నేడు కూడా స్వల్పంగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై రూ.110 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.101800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.111060గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.101800గా.. 24 క్యారెట్ల ధర రూ.111060గా ట్రేడ్ అవుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.101950గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.111210గా కొనసాగుతోంది. ఇటీవలి రోజుల్లో పెరిగిన ధరలతో బంగారం సామాన్యులకు అందనంత దూరంలో నిలిచింది. తప్పనిసరి అయితేనే గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు ఈ వారం తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి బంగారం రేట్లు ఎలా ఉంటాయో.
Also Read: IND vs PAK: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో బిగ్ మిస్టేక్ .. వీడియో వైరల్!
మరోవైపు వెండి రేట్లు కూడా ఇటీవలి రోజులో పెరిగాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధరలో నేడు ఎలాంటి మార్పు లేదు. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,33,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 43 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.91,33,000గా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవి.
