Gold Rate Today in Hyderabad on 2nd July 2024: గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు.. నేడు పెరిగాయి. మంగళవారం (జులై 2) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.100 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,52\30గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,900గా.. 24 క్యారెట్ల ధర రూ.72,980గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది.
Also Read: Double iSmart: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘స్టెప్పా మార్’.. ఈ ఏడాదికే నం.1 మాస్ సాంగ్!
వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.800 పెరిగి.. రూ.91,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,000గా ఉండగా.. ముంబైలో సైతం రూ.91,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,500లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,050గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.95,500లుగా నమోదైంది.