Gold and Silver Price on 2023 December 19th in Hyderabad: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,110గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,620గా కొనసాగుతోంది.
Also Read: China : చైనాలో భారీ భూకంపం.. 90 మందికి పైగా మృతి, 200మందికి గాయాలు
మరోవైపు మంగళవారం వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 70,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ. 300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,000లు ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.