Gold and SIlver Prices Decreased Today in Hyderabad on 13th November 2023: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,540 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,590లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,690లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,990లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,080గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,540 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,590గా కొనసాగుతోంది.
Also Read: Uttarakhand: విరిగిపడిన కొండచరియలు.. మూతపడ్డ టన్నెల్.. 12గంటల పాటు నరకయాతన
వెండి ధర నేడు స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000లు ఉండగా.. చెన్నైలో రూ. 76,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,000గా కొనసాగుతోంది.