Site icon NTV Telugu

Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం నేడు ఎంత ఉందంటే ?

Gold Price Today

Gold Price Today

Gold Price : మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారా.. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. కుప్పకూలుతున్నాయని చెప్పాలి. మొన్నటి వరకు తులం బంగారం ధర 22 క్యారెట్లకు సుమారు రూ. 75 వేల చేరువకు కూడా వెళ్లింది. ఇప్పుడు మాత్రం రూ. 70 వేల దిగువకు పడిపోయింది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. యూఎస్ డాలర్ విపరీతంగా పుంజుకుంది. ట్రంప్ టారిఫ్స్ పెంచుతారని.. పన్నులు తగ్గిస్తారని.. ఇది మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని.. తద్వారా డాలర్ బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు తగ్గించొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు ఇంకా దిగొస్తాయి.

Read Also:UP: పది మంది శిశువుల సజీవ దహనం.. స్పందించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి

ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 6946 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 55,568 గా ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 69,460 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఒక గ్రాము ధర రూ. 7577 గాను, 8 గ్రాముల ధర రూ. 60,616 గాను, అలాగే 10 గ్రాముల ధర రూ. 75,770 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది. అలాగే వెండి విషయానికి వస్తే, ఒక గ్రాము వెండి ధర రూ. 98.90 గాను , అలాగే 8 గ్రాముల వెండి ధర రూ. 791.20 గాను, అదేవిధంగా 10 గ్రాముల వెండి ధర రూ. 989 గా ఉంది, ఇక నిన్నటి ధరతో పోల్చితే ఈ రోజు వెండి ధర రూ. 1 తగ్గింది.

Read Also:Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 6946 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 55,568 గా ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 69,460 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది.

Exit mobile version