Gold Today Rate in Hyderabad on 5th October 2023: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇటీవల పెరిగిన పసిడి ధరలు.. గత 8-10 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,850లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,650గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,590 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 57,370గా కొనసాగుతోంది.
Also Read: RBI MPC Meeting: నేటి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం.. శక్తికాంతదాస్ వరాలు కురిపించేనా?
మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 70,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,700లు ఉండగా.. చెన్నైలో రూ. 73,100గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 73,100లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,100గా కొనసాగుతోంది.