Gold and Silver Price in Hyderabad Today: వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఏప్రిల్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,080గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,700గా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది.
Also Read: Archery World Cup 2024: ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి.. స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత్!
నేడు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కిలో వెండి రూ.84,000లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,000 కాగా.. ముంబైలో రూ.84,000గా ఉంది. చెన్నైలో రూ.87,500గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.87,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,000గా ఉంది.