NTV Telugu Site icon

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మరోసారి 74 వేల మార్క్‌ను దాటింది !

Today Gold Rates

Today Gold Rates

Gold Price Today on 16 July 2024 in India: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్. రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నిన్న తగ్గాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగింది. మంగళవారం (జులై 15) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.74,020గా ఉంది. దాంతో మరోసారి 74 వేల మార్కును దాటింది.  దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,170గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,020గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.68,300గా.. 24 క్యారెట్ల ధర రూ.74,510గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,020గా ఉంది.

Also Read: Jio Annual Packs: ఇకనుంచి రెండు వార్షిక ప్లాన్స్ మాత్రమే.. ప్రయోజనాల్లోనూ మార్పులు!

వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.95,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,000గా ఉండగా.. ముంబైలో సైతం రూ.95,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.99,500లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.94,250గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500లుగా నమోదైంది.

Show comments