NTV Telugu Site icon

Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 రోజుల్లో ఇదే మొదటిసారి!

Gold Price Today

Gold Price Today

Gold Rate Today Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గింది. గత 10 రోజులుగా పసిడి ధరలు పెరగడం లేదా స్థిరంగా ఉన్నాయి. ఈ పది రోజుల్లో బంగారం ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. సోమవారం (జులై 8) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580గా ఉంది. మరోవైపు నేడు కిలో వెండిపై రూ.200 పెరిగి.. రూ.95,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,580
విజయవాడ – రూ.73,580
బెంగళూరు – రూ.73,580
ముంబై – రూ.73,580
కోల్‎కత్తా – రూ.73,580
ఢిల్లీ – రూ.73,730
చెన్నై – రూ.74,180

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,450
విజయవాడ – రూ.67,450
బెంగళూరు – రూ.67,450
ముంబై – రూ.67,450
కోల్‎కత్తా – రూ.67,450
ఢిల్లీ – రూ.67,600
చెన్నై – రూ.68,000

Also Read: Kuldeep Yadav Marriage: బాలీవుడ్ నటితో పెళ్లి.. కుల్దీప్ యాదవ్‌ ఏమన్నాడంటే?

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,500
విజయవాడ – రూ.99,500
ముంబై – రూ.95,000
చెన్నై – రూ.99,500
కోల్‎కతా – రూ.95,000
ఢిల్లీ – రూ. 95,000
బెంగళూరు – రూ.94,600