NTV Telugu Site icon

Gold Rate Today: అంతా అయిపాయె.. పండగ వేళ ‘గోల్డ్’ షాక్!

Today Gold Price

Today Gold Price

Gold Price Today in Hyderabad: దసరా పండగ వేళ బంగారం ధరలు దిగొచ్చాయని సంతోషించే లోపే.. అంతా అయిపాయె. మూడు రోజులు రేట్స్ తగ్గాయనుకుంటే.. నేడు భారీగా పెరిగి గోల్డ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 11) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 పెరిగి.. రూ.70,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.760 పెరిగి.. రూ.77,400గా నమోదైంది.

మరోవైపు వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధర కూడా నేడు ఊహించని రీతిలో పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై 2 వేలు పెరిగి.. రూ.96,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష రెండు వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 85 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,950
విజయవాడ – రూ.70,950
ఢిల్లీ – రూ.71,100
చెన్నై – రూ.70,950
బెంగళూరు – రూ.70,950
ముంబై – రూ.70,950
కోల్‌కతా – రూ.70,950
కేరళ – రూ.70,950

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,400
విజయవాడ – రూ.77,400
ఢిల్లీ – రూ.77,550
చెన్నై – రూ.77,400
బెంగళూరు – రూ.77,400
ముంబై – రూ.77,400
కోల్‌కతా – రూ.77,400
కేరళ – రూ.77,400

Also Read: Vettaiyan Collections: రజనీ ‘వేట్టయన్‌’ రికార్డు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే?

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,000
చెన్నై – రూ.1,02,000
కోల్‎కతా – రూ.96,900
బెంగళూరు – రూ.85,000
కేరళ – రూ.1,02,000