NTV Telugu Site icon

Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

Goldd

Goldd

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. నిన్న పెరిగిన ధరలు, ఇవాళ తగ్గుముఖం పట్టాయి.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర తగ్గగా.. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా కొనసాగుతోంది… ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్ల ధర రూ.67,090గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది..

ఇక వెండి ధరల విషయానికొస్తే.. బంగారం దారిలోనే నడిచింది.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,100 గా ఉండగా.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,600లుగా ఉంది. ముంబైలో రూ.75,600, బెంగళూరులో రూ.74,900, కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.75,600లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000 గా నమోదైంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..