కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర.. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నిన్న భారీగా పెరిగిన పసిడి రేట్లు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.500 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,050గా.. 24 క్యారెట్ల ధర రూ.96,060గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Daggubati Purandeswari: బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం!
మరోవైపు వెండి ధర కాస్త ఊరటిస్తోంది. వరుసగా రెండు రోజులు తగ్గిన ధర నేడు సుస్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,900గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ఒక లక్ష 9 వేలుగా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
