NTV Telugu Site icon

Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

Gld Price

Gld Price

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గురువారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి .. రూ. 57,750కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ.10 పెరిగి .. రూ. 63,000కి చేరింది.. ఇక కేజీ వెండి రూ.1000 దిగొచ్చి.. రూ. 73,300కి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,600గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,750గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,000గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,000గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000గా నమోదైంది..

వెండి విషయానికొస్తే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. కేజీ వెండి రూ. 1000 దిగొచ్చి.. రూ. 73,300కి చేరింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,200.. బెంగళూరులో రూ. 70,500గా ఉంది. మిగిలిన ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..