Gold Price Today 15th July 2023: దేశీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. పలు దేశాల భౌగోళిక పరిస్థితులు, రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వ, డాలర్ విలువ లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. ధరలు పెరిగినా కూడా బంగారం వ్యాపారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.
బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,150గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ.77,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 81,300లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 81,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 81,300ల వద్ద కొనసాగుతోంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read: tomato rate effect: 3 టన్నుల టమాటాలు స్మగ్లింగ్..ఇలా పట్టేశారు