Gold and Silver Price Today in Hyderabad: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో బంగారం కొనుగోలు చేసి.. ధరిస్తుంటారు. పండగలు, శుభకార్యాల సమయాల్లో డిమాండ్‌కు తగ్గట్లుగానే.. పసిడి రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. గతేడాది చివరలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. అంతేకాదు రికార్డు స్థాయిని కూడా తాకాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి.
దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఎలాంటి మార్పు లేదు. గత మూడు రోజుల్లో రూ. 100, రూ. 250, రూ. 400 చొప్పున తగ్గింది. దీంతో 3 రోజుల్లోనే రూ. 750 దిగొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,420గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,820గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,270గా కొనసాగుతోంది.
Also Read: Guntur Kaaram : గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..వేదిక ఎక్కడంటే..?
నేడు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 76,600లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 76,600గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో అత్యల్పంగా కిలో వెండి ధర 74,000గా ఉంది.