NTV Telugu Site icon

Gold Rate Today: పండుగ వేళ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

Gold Price Today

Gold Price Today

Gold and Silver Rates Increased on 14th January 2024: పండుగ వేళ బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్లపై రూ. 300, 24 క్యారెట్లపై రూ. 320 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,420గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,450లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,270గా కొనసాగుతోంది.

Also Read: Guntur Kaaram : గుంటూరు కారం సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్..

ఈరోజు వెండి ధర కూడా పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 500 పెరిగి.. రూ. 78,000లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 76,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 73,250గా ఉంది.