NTV Telugu Site icon

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తులం బంగారంపై రూ.1900 తగ్గింది!

Gold Rate Women

Gold Rate Women

Gold Rate Drops Rs 1900 in 2 Days in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.900 తగ్గింది. దాంతో ఈ రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.1900 తగ్గింది. శుక్రవారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500.. 24 క్యారెట్ల ధర రూ.72,550గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది.

Also Read: Shah Rukh Khan Health Update: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ పోస్ట్‌!

నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.92 వేలుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,000 కాగా.. ముంబైలో రూ.92,000గా ఉంది. చెన్నైలో రూ.96,500లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,500గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.96,500లుగా ఉంది.