NTV Telugu Site icon

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

Gold

Gold

Today Gold and Silver Prices in Hyderabad on 17th October 2023: పసిడి ప్రియులకు శుభవార్త. పండగ వేళ వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 310 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 340 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,260గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది.

Also Read: Leo Advance Bookings : భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన విజయ్ దళపతి లియో మూవీ ..

వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,100లు ఉండగా.. చెన్నైలో రూ. 77,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,500గా కొనసాగుతోంది.

 

Show comments