Gold Price Today in Hyderabad on 31st October 2023: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 230 తగ్గింది. నేడు 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
# న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,550 వద్ద కొనసాగుతోంది.
# ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400గా ఉంది.
# చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,560 వద్ద కొనసాగుతోంది.
# కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,200లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా కొనగాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.
# పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 57,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,400గా ఉంది.
నేడు బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 75,600కి చేరింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి రూ. 78,500 కాగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,600 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.