Gold Mines : ఒడిశాలోని మూడు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు ఉక్కు, గనుల శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. డియోగర్, కియోంజర్, మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) సర్వేలు వెల్లడించాయి. ఈ అంశాన్ని ఆ రాష్ట్రంలోని డెంకనల్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ సమల్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ప్రఫుల్లా మల్లిక్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని తెలిపారు.
Read Also: March 1st: మార్చిలో ఈ మార్పులను గమనించండి
దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 10న ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు పేర్కొంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ వెల్లడించింది.
Read Also:Partner Exchange: క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో.. భర్తలను మార్చుకున్న భార్యలు