Gold : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం భారీగా పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్ నుంచి సుమారు 2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాల్లో స్మగ్లర్లు అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. అయితే నాలుగు కిలోల బంగారాన్ని తీసుకొచ్చారు. వాటిని విమానం టాయిలెట్ లో దాచిన నాలుగు బంగారు బిస్కెట్లను దాచిపెట్టారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తూకం వేయగా.. 3.969 కిలోల బరువు ఉన్నాయి. వీటి ధర రూ.2 కోట్ల దాకా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Sucide: బతకలేను..‘గుడ్ బై’.. కాల్చుకుని చనిపోయిన మాజీ హోం మంత్రి బంధువు
తమకు వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేసి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‘‘అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించే విమానం.. రెండు డొమెస్టిక్ ట్రిప్ లు వెళ్లొచ్చింది. ఎయిర్ పోర్టులోని టర్మినల్ 2లో ఆగింది. ఈ సందర్భంగా విమానంలో సోదాలు చేశాం. వాష్ రూమ్ లో సింక్ కింద ఓ బూడిద రంగు సంచిని అతికించి ఉండటం గమనించాం. దాన్ని తీసి చూడగా.. అందులో 4 బంగారు బిస్కెట్లు కనిపించాయి’’ అని కస్టమ్స్ అధికారులు వివరించారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బంగారం, ప్యాకింగ్ మెటీరియల్ ను జప్తు చేశామని వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నాలుగు బంగారు కడ్డీల మొత్తం విలువ రూ. 1,95,72,400 అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.