పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల ధర రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (మే 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,950గా.. 24 క్యారెట్ల ధర రూ.97,040గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Vangaveeti Mohana Ranga: వంగవీటి రంగా విగ్రహం తొలగింపు.. అంతర్వేదికరలో ఉద్రిక్తత!
మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి నేడు స్వల్పంగా తగ్గింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.99,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,10,900గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.99,900గా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన రేట్స్ ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
