NTV Telugu Site icon

Gold Price : తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర

Gold

Gold

Gold Price : భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఏ చిన్న కార్యమైనా చాలు మహిళలు బంగారం ధరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాటు బంగారానికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోతుంది. రేట్లు కూడా ఆ రకంగానే పెరుగుతాయి. కొద్ది కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో గోల్డ్ షాపుల్లో రద్దీ తగ్గింది. ఆ మధ్య రికార్డు గరిష్టాల నుంచి పడినా.. మరోసారి 3 రోజుల కింద ఆల్ టైం హై వాల్యూకు చేరాయి. తర్వాత ఒక్కరోజులోనే తులానికి రూ.700 మేర పడిపోయిందనుకునే లోపే మళ్లీ ఇవాళ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Read Also: Jagtial Crime: భర్త పదేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు..కొడుకు కానరాకుండా వెళ్లిపోయాడు

దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్వల్పంగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధ‌ర ఏకంగా రూ.110 పెరిగి.. రూ.56,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ.120 పెరిగి రూ. 61,750గా కొనసాగుతోంది. ఇక దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.78,100గా ఉంది. అయితే బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్లప్పుడు వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. హైద‌రాబాద్‌, విజయవాడ, విశాఖ పట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750గా ఉంది. మార్కెట్‍లో మంగళవారం నాడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి.. రూ.77,770గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ..82,700 పలుకుతోంది. ఢిల్లీ, కోల్​కతాలో వెండి ధర రూ.​ 78,100గా ఉంది.

Read Also: Mla muthireddy daughter: నా సంతకం ఫోర్జరీ చేశారు.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు