Site icon NTV Telugu

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Rate Today

Gold Rate Today

గోల్డ్ లవర్స్‌కు గుడ్‌ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు భారీ స్థాయిలో దిగొచ్చింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. ఈరోజు రూ.750 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై వరుసగా రూ.60, రూ.820 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,870గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.91,550గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,870గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.91,700గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,020గా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుంది.

Also Read: Crime News: అనంతపురం శివారులో దారుణహత్య.. బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు!

మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి.. నేడు భారీగా తగ్గింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి.. రూ.1,09,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 19 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్ష 9 వేలుగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.

Exit mobile version