2025 దీపావళి సమయంలో ఉవ్వెత్తున ఎగసిన బంగారం ధరలు కొన్ని రోజులుగా దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో.. దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి.. భారతదేశంలోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మరలా షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.76 పెరిగి.. రూ.12,158గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.70 పెరిగి.. రూ.11,145గా నమోదైంది.
బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,21,580గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,450గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,580గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.1,11,450గా నమోదైంది. విజయవాడ, విశాఖ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,22,290గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,11,100గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,21,730గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,11,600గా ట్రేడ్ అవుతోంది.
Also Read: Cyclone Montha Alert: బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటలు భారీ వర్షాలు!
మరోవైపు వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు కూడా నేడు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై 1 వెయ్యి పెరిగింది. బుధవారం కిలో వెండి ధర రూ.1,52,000గా నమోదయింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,66,000గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం, వెండి ధరలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. జీఎస్‌టీ కలుపుకుంటే.. ధరలు ఇంకా పెరుగుతాయని గుర్తించుకోవాలి.
