Site icon NTV Telugu

Gold Rates: యుద్ధం వేళ వణికిస్తున్న బంగారం ధరలు.. ఇవాళ తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందంటే?

Wedding Gold Woman

Wedding Gold Woman

భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య బంగారం దరలు భగ్గుమంటున్నాయి. నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 330 పెరిగింది. వరుసగా పసిడి దరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. నేడు సిల్వర్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై కేవలం రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,868, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,045 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Char Dham Yatra: భారత్- పాక్ మధ్య యుద్ధం.. ఛార్ధామ్ యాత్ర నిలిపివేత!

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరగడంతో రూ. 90,450 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరగడంతో రూ. 98,680 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,600గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,830 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Pakistan : పరేషాన్‌లో పాకిస్తాన్‌… 48 గంటల పాటు పెట్రోల్ బంక్‌లు బంద్‌..

నేడు సిల్వర్ ధరలు తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,10,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 98,900 వద్ద అమ్ముడవుతోంది.

Exit mobile version