NTV Telugu Site icon

Gold and Silver Rates Today: పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today

Gold Price Today

Gold and Silver Rates Today: గడిచిన రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారు ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు భారీగా తగ్గిన బంగారం, శనివారం నాడు మాత్రం ఏకంగా 10 గ్రాములకు 600 రూపాయలకు పైగా పెరిగి షాక్ ఇచ్చింది. ఇకపోతే, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 650 రూపాయలు పెరిగి రూ. 77,450గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయల పెరిగి రూ. 71,000 కు చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 490 రూపాయల మేరకు పెరిగి రూ. 58,090 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

Also Read: R.Ashwin Wife: మా ఆయన రిటైర్మెంట్తో రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదు..

ఇక మరోవైపు వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తూ భారీగానే పెరిగింది. కిలో వెండి ధరపై హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 99,000గా అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఇదే రేటు కొనసాగుతుండగా.. మిగతా రాష్ట్రాలలో కిలో వెండి ధర రూ. 91,500 గా ఉంది.

Also Read: Cricketers Retirement in 2024: ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?

Show comments