బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. సిల్వర్ ధర రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,838, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,935 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.99,350 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 1,08,380 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,08,530 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,37,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,27,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
