Site icon NTV Telugu

Gokulam Signature Jewels : ఘనంగా ప్రారంభమైన గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షోరూమ్‌ కూకట్‌పల్లిలో..

Gokulam Showroom

Gokulam Showroom

Gokulam Signature Jewels : గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ హైదరాబాద్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభమైంది. తన సెకండ్ అవుట్ లెట్ ని కేపీహెచ్ బీలో గ్రాండ్ గా ఓపెన్ చేసింది. మే 04న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాసవి శ్రీ శ్రీ సిగ్నేచర్స్ కేపీహెచ్ బీ 5th ఫేజ్, అపోజిట్ నెక్సస్ మాల్ కూకట్ పల్లిలో ప్రారంభమైంది. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా కొత్త షోరూమ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మేనేజింగ్ డైరక్టర్లు బాబూరావు , సుబ్బారావు , లలిత , సరిత గొల్లపూడి పాల్గొన్నారు

ఈ మేరకు గోకులం సిగ్నేచర్స్ ప్రకటన విడుదల చేసింది. మా కొత్త అవుట్‌లెట్ లో ప్రత్యేకమైన నీలా కలెక్షన్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇది స్థిరమైన లగ్జరీ, ఆధునిక చక్కదనాన్ని కలిగి ఉన్న ప్రయోగశాలలో డెవలప్ చేసిన వజ్రాల ఆభరణాల ప్రత్యేక సేకరణ అని తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా సిల్వర్ జువెలరీ, ల్యాబ్‌ డైమండ్‌ జువెలరీని ప్రజలకు పరిచయం చేయనుంది. గోకులం పేరుతో సిగ్నేచర్‌ సిల్వర్‌ ఆర్టికల్స్‌ షోరూమ్‌ కూకట్‌పల్లిలో వెండి ఆభరణాలు, వెండి వస్తువులు , ల్యాబ్ గ్రౌన్ వజ్రాలు ప్రారంభించబోతోంది. మొదటి నుంచి కూడా అంకిత భావంతో పని చేసి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఉత్పత్తులు డిజైన్ చేయడం వీళ్ల స్టైల్. అందుకే మార్కెట్ లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే టాప్ బ్రాండ్‌గా సత్తా చాటుతోంది.

ఈ సందర్భంగా సినీ నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. గోకులం సిగ్నేచర్‌ జువెల్స్‌ కొత్త షో రూమ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ షో రూమ్ లో స్త్రీలకు నచ్చే అన్ని వెరైటీలు ఉన్నాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా.. మగువలకు నచ్చే డిజైన్లపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. సిల్వర్ జువెలరీ, ల్యాబ్‌ డైమండ్‌ జువెలరీలో వివిధ రకాల డిజైన్ లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నట్లు కూడా ఆమె తెలిపారు.

Exit mobile version