NTV Telugu Site icon

Indrakeeladri: శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

Indrakeeladri

Indrakeeladri

Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారె సమర్పించారు.

Read Also: Andhra Pradesh: తమ అనుమతి లేకుండా జీపీఎస్‌ జీవో, గెజిట్‌ విడుదలపై సీఎంవో ఆరా

మరోవైపు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ‘శ్రీ కనకదుర్గా దేవి మహిమలు’ అంశంపై తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 19, 20 తేదీల్లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ప్రవచనాలు వినిపిస్తారని ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమం 19, 20 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు.