Site icon NTV Telugu

Goddess Appear in Neem Tree: వేపచెట్టుకి అమ్మవారి ఆకారం.. ఎక్కడంటే?

neem tree

Collage Maker 28 Nov 2022 04.30 Pm

ఈ సృష్టిలో చిత్ర విచిత్ర ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఏలియన్ ఆకారంలో జన్మించడం, భారీ సర్పాల హల్ చల్, చెప్పు ఎత్తుకెళ్ళిన పాము.. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా బనగానపల్లెలో వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టు కు అమ్మవారి ఆకారం కనిపించింది. జమ్మలమ్మ తల్లి దర్శనం ఇచ్చిందని నమ్ముతున్న భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. పసుపు కుంకుమలు రాసి ఆభరణాల అలంకరించి పూజలు చేస్తున్నారు స్థానికులు. వేప చెట్టు పైభాగాన్ని ఇటీవలే కొద్ది నెలల క్రితం రంపంతో కోత కోసినట్టు స్థానికులు చెబుతున్నారు.

నంద్యాల జిల్లా బనగానపల్లె, తెలుగుపేటలోని పాత బావి వద్ద ఉన్న వేప చెట్టుకు ఈ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టు మొదలుభాగంలో అమ్మవారి రూపంతో ఆకారం ఏర్పడి కనిపించింది. దీంతో స్థానికుల్లో భయంతో పాటు భక్తి భావం కూడా ఏర్పడింది. తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పు అమ్మగా భావించి పూజించే సాక్షాత్తు జమ్ములమ్మ తల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ.. అమ్మవారి రూపం ఆకారం ఏర్పడిన చోట , భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు రాసి , ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపచెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన వింత ఘటన సమాచారం పట్టణంలోని వివిధ కాలనీవాసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి, నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకుంటున్నారు.

Read Also: Two Families Violence: రెండు కుటుంబాల మధ్య ప్రేమ చిచ్చు

వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడి హాట్ టాపిక్ గా మారిన ఈ వేప చెట్టును గత కొద్ది నెలల క్రితం చెట్టు పైభాగాన్ని రంపం యంత్రంతో కోసివేసి చెట్టును పైభాగం అంతా కోసి వేసి తొలగించడం జరిగింది. చెట్టును కోసి వేయడం వల్లే అమ్మవారు ఆగ్రహించి, వేప చెట్టుపై అమ్మవారు దర్శనమిచ్చారనే ప్రచారం జరుగుతుంది. వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన ఘటన చెట్లను నరికి వేయొద్దని సందేశాన్ని అమ్మవారు స్పష్టంగా తెలియజేసారని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటన వైరల్ అవుతోంది.

Read Also: Facebook to make changes: అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి ఫేస్‌బుక్‌లో ఈ మార్పులు

Exit mobile version