Site icon NTV Telugu

Cotton Barrage: కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి

Cotton Barrage

Cotton Barrage

Cotton Barrage: ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. కాస్త తెరపి ఇచ్చినా.. ఐఎండీ అంచనాల ప్రకారం ఎగువ ఉన్న గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 41.4 అడుగులు ఉందని ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.41 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. రేపటి నుంచి ధవళేశ్వరం వద్ద వరద పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.. కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వరద చేరే అవకాశం ఉన్నందని అన్నారు.

ఇక, విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్.. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం రేపటి నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు వరద స్వల్పంగా పెరుగుతూ ప్రవహించనున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 1ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు..

Exit mobile version