Site icon NTV Telugu

Godavari Express: గోదావరి ఎక్స్‌ప్రెస్ పరుగులకు 50 ఏళ్లు.. ఘనంగా వేడుకలు

Godavari Express

Godavari Express

Godavari Express: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ – హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్‌ప్రెస్‌. సేఫ్టీ, సమయ పాలనలో పక్కగా వుండే ఈ రైలు ఒకప్పుడు రాజధానికి వెళ్ళడానికి అత్యంత అనువైనది మాత్రమే కాదు ప్రయాణీకులకు సెంటిమెంట్ కూడా. బుల్లెట్ రైళ్ల వైపు కాలం పరుగులు పెడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా 50వసంతాల వేడుకలు జరుపుకుంటోంది గోదావరి ఎక్స్‌ప్రెస్.

Read Also: CM YS Jagan: ఈ నెల 3న దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్‌

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా రైల్వే అధికారులు, ప్రజలు కేక్‌ కట్‌ చేయనున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు జరపనున్నారు. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విశాఖ – హైదరాబాద్ డెక్కన్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది.

ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య నడుస్తుంది. 1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ – సికింద్రాబాద్ మద్య ట్రైన్ నంబర్ 7007గా, సికింద్రాబాద్ – వాల్తేరు మద్య ట్రైన్ నంబర్ 7008గా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ ట్రైను 18 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్). సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు. 17 భోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్)తో ప్రయాణిస్తుంది. ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనతను గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు సాధించింది.

Exit mobile version