NTV Telugu Site icon

Crispy Gobi 65 : రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..

Gopi 65

Gopi 65

కాలిఫ్లవర్ తో మనం ఎన్నో రకాల వంటలను చేసుకుంటాము.. కర్రీ, పకోడీ, పచ్చళ్ళతో పాటు అందరు ఇష్టంగా తినే గోబీని కూడా ఈ కాలిప్లవర్ తోనే తయారు చేస్తారు.. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మనకు హోటల్స్, క్యాటరింగ్ లో, కర్రీ పాయింట్ లలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. గోబీ 65 కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే రుచిగా, కరకరలాడుతూ ఉండే గోబి 65 ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

క్యాలీప్లవర్ – ఒకటి,

మైదా పిండి – అర కప్పు,

కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్,

నూనె – డీప్ ఫ్రైకు సరిపడా,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,

కారం – ఒక టీ స్పూన్,

ధనియాల పొడి – ఒక టీ స్పూన్,

మిరియాల పొడి – పావు టీ స్పూన్,

గరం మసాలా – ముప్పావు టీ స్పూన్,

ఉప్పు – తగినంత,

వంటసోడా – చిటికెడు,

తరిగిన కరివేపాకు – కొద్దిగా,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా..

తయారీ విధానం :

ముందుగా కాలిప్లవర్ ను ముక్కలుగా కోసి వేడి నీటిలో వేసుకోవాలి..ఇందులో పసుపు వేసి కలపాలి. ఇప్పుడు క్యాలీప్లవర్ ముక్కలను వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి నీరంతా పోయే వరకు జల్లి గంటెలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి.. పిండిని లూజ్ గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి.. తర్వాత ఆ ముక్కలను అందులో వేసుకొని బాగా పిండి పట్టేలా కలుపుకోవాలి.. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేయాలి. తరువాత నూనెకు తగినన్ని క్యాలీప్లవర్ ముక్కలను వేసుకుని వేయించాలి. వీటిని వేసిన వెంటనే కదిలించకుండా ఒక నిమిషం తరువాత అటూ ఇటూ కదిలిస్తూ వేయించుకోవాలి. వీటిని కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ గోబి 65 తయారవుతుంది..అంతే ఎంతో సింపుల్ గా ఉండే గోబీ 65 రెడీ..