Site icon NTV Telugu

Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు

Bishnoi

Bishnoi

Lawrence Bishnoi: జైలు శిక్ష పడిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించాడు. జైలు నుంచే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు. కృష్ణజింకను చంపినందుకు నటుడు సల్మాన్ ఖాన్ సమాజానికి క్షమాపణ చెప్పినప్పుడే కేసు ముగుస్తుందని అన్నారు.

సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూలో అన్నారు. అతను మా బికనీర్ గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యమని, సల్మాన్‌ఖాన్‌కు భద్రత తొలగిస్తే చంపేస్తానని బిష్ణోయ్ అన్నారు. సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే, ఆ విషయం ముగిసిపోతుందన్నారు. సల్మాన్ ఖాన్‌ను అహంకారి అని అభివర్ణించిన బిష్ణోయ్.. మూసేవాలా కూడా అంతేనని అన్నారు. సల్మాన్ ఖాన్ అహం రావణుడి కంటే పెద్దదని గ్యాంగ్‌స్టర్ చెప్పాడు.

Read Also: World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

కృష్ణజింకను చంపడం ద్వారా సల్మాన్ ఖాన్ తన వర్గాన్ని అవమానించాడని లారెన్స్ అన్నారు. సల్మాన్ ఖాన్ పట్ల సమాజం కోపంగా ఉందని.. సమాజాన్ని సల్మాన్ అవమానించాడన్నాడు. అతనిపై కేసు నమోదు చేసినా క్షమాపణ చెప్పలేదు. అతను క్షమాపణ చెప్పకపోతే, పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. తాను మరెవరిపైనా ఆధారపడనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చెప్పాడు.

Exit mobile version