Site icon NTV Telugu

Yuvaraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా సర్కార్ నోటీసులు

Yuvaraj Min

Yuvaraj Min

Yuvaraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు. గోవాలోని మోర్జిమ్ లో యువరాజ్ సింగ్ కు ఓ విలాసవంతమైన భవంతి ఉంది. ఈ భవనం పేరు ‘కాసా సింగ్’. ఈ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చాడు. ఒక విధంగా ఇది పేయింగ్ గెస్ట్ విధానం కిందికి వస్తుంది. ఈ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి.

Read Also: Hansika Motwani : పెళ్లి కూతురిలా ముస్తాబైన దేశముదురు భామ.. ఎంత అందంగా ఉందో..

ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే, ఇంటిని పర్యాటకుల కోసం అద్దెకు ఇస్తామని యువరాజ్ సింగ్ ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం శాఖ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకం అని, అందుకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ వెల్లడించింది. హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గోవా సర్కారు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటీసులకు డిసెంబరు 8వ తారీఖున స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ ను గోవా ప్రభుత్వం ఆదేశించింది.

Exit mobile version