NTV Telugu Site icon

Tavasya: గోవా షిప్‌యార్డ్‌లో రెండవ యుద్ధనౌక “తవస్య” ప్రారంభం..

Tavasya

Tavasya

శనివారం గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్‌ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండవ ఫాలో-ఆన్ యుద్ధనౌక “తవస్య”ను ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ప్రారంభించారు. ఈ యుద్ధనౌక ప్రారంభం.. భారతదేశం నావికాదళ స్వావలంబన వైపు ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో తపస్య కీలక పాత్ర పోషించనుంది. “తవస్య” అనే పేరు మహాభారతంలోని భీముడి పురాణ గద పేరును సూచిస్తుంది. ఈ యుద్ధనౌక.. భారత నావికాదళం యొక్క అజేయమైన స్ఫూర్తిని, పెరుగుతున్న శక్తిని సూచిస్తుందని నేవీ అధికారులు తెలిపారు. ఈ యుద్ధనౌక ఉపరితల, భూగర్భ, వాయు పోరాటాల కోసం తయారు చేశారు. ఇది.. అత్యాధునిక సాంకేతికత, అధిక శక్తితో యుద్ధంలో నైపుణ్యంగా వ్యవహరిస్తాయి.

Read Also: Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు..

2019 జనవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ మధ్య ప్రాజెక్ట్ 1135.6 ఫాలో-ఆన్ ఫ్రిగేట్ల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కింద రెండు యుద్ధనౌకలను నిర్మించడం నిర్ణయమైంది. మొదటి నౌక “త్రిపుట్” 2024 జూలై 24న ప్రారంభించగా.. రెండవ నౌక “తవస్య” శనివారం ప్రారంభించారు. త్రిపుట్, తవస్య యుద్ధ నౌకలు దాదాపు 125 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల డ్రాఫ్ట్, 3,600 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి గరిష్టంగా 28 నాట్ల వేగంతో వెళ్తాయి. వీటిలో స్టెల్త్ ఫీచర్లు, అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫామ్ నిర్వహణ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఈ ఫ్రిగేట్లు P1135.6 సిరీస్ యొక్క ఫాలో-ఆన్‌లు, ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో గోవా షిప్‌యార్డ్‌లో రూపొందించారు.

Read Also: KTR: చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు

తవస్య, త్రిపుట్ నౌకలు అధిక శాతం స్వదేశీ పరికరాలు, ఆయుధాలు, సెన్సార్లను కలిగి ఉంది. వీటిని భారతీయ తయారీ యూనిట్ల ద్వారా నిర్మించారు. వీటి ద్వారా దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా.. స్వదేశీ సామర్థ్యాలను పెంచడం జరుగుతోంది. ఈ ప్రయత్నం భారత్‌లో గణనీయమైన ఉపాధిని సృష్టిస్తోంది. భారతదేశం యొక్క రక్షణ రంగం స్వావలంబన వైపు మరో మెజర్ స్టెప్ గా మారింది.