NTV Telugu Site icon

Solution Challenge Event: విద్యార్థులు మేధోశక్తిని సాంకేతికతను పెంపొందించుకోవాలి

Gnit

Gnit

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్య సంస్థలలో గూగుల్ దేవేలోపెర్స్ స్టూడెంట్ క్లబ్స్ ఆధ్వర్యంలో సొల్యూషన్ ఛాలెంజ్ అనే అంశంపైనా విద్యార్థుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి ( యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజషన్) అందించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను కనుగొనెదిశగా గూగుల్ దేవేలోపెర్స్ స్టూడెంట్ క్లబ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచనలను మేధోమథనం చేయడానికి మరియు సాధ్యమయ్యే పరిష్కారాలతో నూతన సాంకేతిక అవకాశాలను కూడా జోడిస్తూ తద్వార నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే విధంగా యువత తమ మేధో శక్తిని పెంపొందించుకుని భారత దేశ ఖ్యాతిని నాలుగు దిశలా తెలియపరిచే ఉద్దేశంతో విద్యసంస్థలలో చదివే విద్యార్థు ఆసక్తిగా పాల్గొనడం జరిగింది.

విద్య సంస్థల వైస్ చైర్మన్ జీఎస్ కోహ్లి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ సైనీ, డైరెక్టర్ డాక్టర్ కె వెంకటరావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారథి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషి సాయల్ , ప్రొఫెసర్ రంగనాయకులు మరియు ఇతర విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొని వారి విలువైన ప్రదంగాలతో విద్యార్థులను ఉతేజపరచడం జరిగింది.విద్యార్థులందరూ తాము ఎంచుకున్న సాంకేతిక కోణంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పరిష్కారాన్ని రూపొందించడంలో ప్రొఫెసర్.ఆర్.ఎస్.సలారియా, ప్రొఫెసర్.చంద్రశేఖర్, ప్రొఫెసర్.రాజశ్రీ లాంటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఉపాధ్యాయుల విలువైన సలహాలు తీసుకోవడం తో పాటు భవిష్యత్తులో ఎదగటానికి కూడా వారి సలహాలు ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థు mari టు విద్యార్థినులు ఆనందం వ్యక్త చేసారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు అందరు కూడా మార్చ్ 31 తేదీన జరిగే గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొంటారు.

Read Also: India vs Pakistan: భారత్‌కు శివరాత్రి పాక్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవానికి 20 ఏళ్లు.

ఈ కార్యక్రమానికి సభాపతిగా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజర్ మొగిలి విజేంద్ర మరియు వర్మక్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ రాహుల్ రావు వక్తలుగా విచ్చేసి విద్యార్థులు కేవలం ఉద్యోగం పొందడమే లక్ష్యంగా పెట్టుకోకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ తద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అందుగు అనుగుణంగా తమ మేధోశక్తిని సంకేతికతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియచేసారు. జీ డీ ఎస్ సీ – జీ యెన్ ఐ కో ఆర్డినేట్ చేసిన విద్యార్ధి కె.చంద్రకిరణ్ రెడ్డి కార్యక్రమానికి హాజరై తమ విలువైన సందేశాల ద్వారా ప్రేరణ కల్పించిన వక్తలందరికి విద్యార్థులు తరపున కృతజ్ఞతలు తెలియచేసి వారిని సన్మానించడం జరిగింది.

తరువాత విద్యార్థులు వారి ప్రసంగంలో గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సొల్యూషన్ ఛాలెంజ్ ఈవెంట్ ద్వారా యువతీ యువకులకు వారి సృజనాత్మకత మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప వేదిక దొరికిందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి తమ వంతు సహకారాన్ని అందించాలనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

Read Also: Nadendla Manohar:వైసీపీని నడిపిస్తోంది ఐ ప్యాక్ టీమే