Site icon NTV Telugu

Gmail: జీమెయిల్ సేవలకు అంతరాయం.. 2గంటల తర్వాత పునరుద్ధరణ

Gmail

Gmail

Gmail: గూగుల్‌ జీమెయిల్‌ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్‌ సర్వీసులు పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. రాత్రి 9.45 నిమిషాలకు సర్వీసులను పునరుద్ధరించినట్టు గూగుల్‌ వివరణ ఇచ్చింది. బ్యాక్‌లాగ్‌ మెసేజ్‌లు మరికొద్ది గంటల్లో డెలివరీ అవుతాయని పేర్కొంది.

World Malaria Report: మళ్లీ మలేరియా.. భారత్‌ సహా 4 ఆఫ్రికా దేశాల్లోనే అధికం

జీమెయిల్‌కు అంతరాయం ఏర్పడడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం ట్రెండింగ్‌గా మారిపోయింది. అయితే సేవలు ఆగిపోయిన కొన్ని గంటల తర్వాత మళ్లీ సేవలను పునరుద్ధరించటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గూగుల్ సేవలపైనే ఆధారపడిన విషయం తెలిసిందే.

Exit mobile version