GlobeTrotter Event: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్–అడ్వెంచర్ మూవీ #GlobeTrotter (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన భారీ ఈవెంట్ నేడు (శనివారం) సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ కార్యక్రమంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ వివరాలను వెల్లడించడంతో మరింత ఆసక్తిని పెంచేశాడు. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌తో పాటు, గ్లోబల్ అడ్వెంచర్ ప్రపంచాన్ని పరిచయం చేసే అద్భుతమైన విజువల్స్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు. 100 అడుగుల భారీ స్క్రీన్‌పై ఈ స్పెషల్ కంటెంట్‌ను ప్రదర్శించిన తర్వాత, ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించడంతో మహేశ్ అభిమానుల్లో సంతోష వాతావరం నెలకొంది.
ఇప్పటికే సినిమా యూనిట్ ప్రతినాయకుడిగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను, మరో కీలక పాత్ర మందాకినిగా ప్రియాంకా చోప్రాను పరిచయం చేసింది. ఇక మహేశ్‌బాబు గెటప్, పాత్ర పేరు వంటి కీలక అంశాలను ఈ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు. ఇక కొత్తగా విడుదల చేసిన ‘సంచారీ’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక నేడు జరగబోయే ఈవెంట్ ఏర్పాట్లు కూడా వినూత్నంగా ఉండటం విశేషం. పాస్‌పోర్ట్‌లా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈవెంట్ పాస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాస్‌లలో ఈవెంట్ ప్రాంగణంలోకి ఎలా వెళ్లాలి, అలాగే పాటించాల్సిన సూచనలు, అభిమానుల రాకపోకల దిశలు వంటి వివరాలు ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ రాజమౌళి, మహేశ్‌బాబు ప్రత్యేక వీడియోల ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఇండియాలోని అభిమానులు జియో హాట్‌స్టార్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.
IPL 2026 Trade List: రసవత్తరంగా ప్లేయర్ల ట్రేడ్.. పూర్తి లిస్ట్ ఇదే..!
The title of the film will be revealed along with a visual to the world…
Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
