NTV Telugu Site icon

Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం

Global Economic Downturn

Global Economic Downturn

Global Economic Downturn: అనుకున్నట్లే అయింది. మాంద్యం మొదలైంది. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం తన ప్రభావం చూపుతోంది. ఆ సూచనలు భారతదేశ వాణిజ్య రంగంపై అప్పుడే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. 2022 డిసెంబర్‌ నెలలో ఇండియా సరుకుల ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా ఈ లావాదేవీల విలువ 34 పాయింట్‌ 5 బిలియన్‌ డాలర్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

2021 డిసెంబర్‌ నెలతో పోల్చితే ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన డేటా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. మరో వైపు.. మన దేశానికి దిగుమతులు కూడా తగ్గిపోయాయి. ఇంపోర్టులు 3 పాయింట్‌ 5 శాతం మందగించాయి. దీంతో వాటి విలువ 58 పాయింట్‌ 2 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది.

read more: Rozgar Mela: కన్జ్యూమర్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌: ప్రధాని మోడీ

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా కఠినతరం అవుతుండటం, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటం వల్ల వస్తూత్పత్తులకు గ్లోబల్ లెవల్‌లో డిమాండ్ బలహీనపడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో ఎగుమతులు ఊపందుకోనున్నాయని చెబుతున్నారు.

డిసెంబర్‌ నెలలో అన్ని దేశాల్లోనూ వస్తువుల ధరలు పడిపోవటం కూడా ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం చూపిందని తెలిపారు. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం మరింత ముదరనుండటంతో భారత వాణిజ్య వర్గాలు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు మన దేశం చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

Show comments