NTV Telugu Site icon

Indian Marriages: పెళ్లైన భారతీయుల్లో 60 శాతం మంది వివాహేతర సంబంధాలపై ఇంట్రెస్ట్..

India

India

ప్రముఖ డేటింగ్‌ యాప్‌ గ్లీడెన్‌ చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. జనరల్గా భారతీయ సమాజం ఒక భార్య, ఒక భర్త విధానానికి కట్టుబడి ఉంటుంది. కానీ, ప్రాశ్చాత్య దేశాల అలవాట్లు మెల్లగా భారతీయ సమాజంలోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో భారతీయులు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారనే విషయాన్ని ఈ యాప్‌ తన రిసెర్చ్ లో తెలిపింది. దాదాపు 60 శాతం మంది భారతీయులు వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికలో భాగంగా టైర్‌ 1, టైర్‌ 2 సిటీల్లో నివసించే 1503 మంది నుంచి ఈ సమాచారాన్ని సేకరించి యాప్ పరిశోధకులు అంచనా వేశారు. వీరిలో 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన పురుషులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

Read Also: Election Commissioner: నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక.. ప్రధాని మోడీతో కీలక భేటీ

అయితే, భారతీయ సమాజంలో వివాహా బంధానికి ప్రత్యేక ఉంది. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉండాల్సిందే అనే కట్టుబాట్లు ఉన్నాయి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటూ కుటుంబ వ్యవస్థను అద్భుతంగా లీడ్‌ చేసే భారతీయుల్లో.. పెళ్లి అనే బంధంపై తాజాగా ఆలోచన మారుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న చాలా మంది వృత్తిపరమైన, ఇతర ఒత్తిళ్ల నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు, సరికొత్త అనుభూతులను పొందేందుకు వివాహేతర సంబంధాలు వైపు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొనింది. ఏది ఏమైనా తాజా అధ్యయనం ఆధునిక భారతదేశంలో మారుతున్న సంబంధాల గురించి తెలియజేస్తుంది. 46 శాతం మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారితో ఈ తరహా సంబంధాలను పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు.

Read Also: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్‌ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..

పరిశోధనలో తేలిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్‌ విధానంలో రిలేషన్స్‌ కొనసాగిస్తున్నట్లు తేలింది. కాగా, ఇప్పటి వరకు భారతీయ వివాహ బంధంలో ఉన్న గొప్పతనం గురించి తెలిసిన అందరికీ.. తాజా నివేధికలోని అంశాలు కొంత ఆశ్చర్యాన్నికి గురి చేస్తున్నాయి. ఈ అధ్యయనంపై గ్లీడెన్‌ కంట్రీ మేనేజర్‌ సిబిల్‌ షిడెల్‌ మాట్లాడుతూ.. ఈ పరిశోధనలో భాగంగా అనేక విషయాలను తెలుసుకున్నామన్నారు.