NTV Telugu Site icon

Ileana : ఒక్క అవకాశం ఇవ్వండి … టాలెంట్ చూపిస్తానంటున్న గోవా బ్యూటీ..

Ileyana

Ileyana

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే తెలుగులో ఈ భామ కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నసమయంలోనే  బాలీవుడ్ కి వెళ్ళింది.దీనితో ఈ భామ సౌత్ సినిమాలకు దూరం అయింది.అయితే బాలీవుడ్ లో అయినా ఈ భామకు వరుసగా బడా ఆఫర్స్ వచ్చాయా అనుకుంటే అది లేదు.బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు.దీనితో అక్కడ కూడా ఈ భామకు ఆఫర్స్ తగ్గిపోయాయి.

Read Also :Hari Hara Veera Mallu: వీరమల్లు దిగుతున్నాడు .. గెట్ రెడీ

ఇదిలా ఉంటే ఇటీవల పెళ్ళి కాకుండానే తల్లి అయి ఇలియానా వార్తలలో నిలిచింది.ఆ తరువాత ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది.అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇలియానా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.హాట్ హాట్ ఫోటోషూట్ తో రెచ్చగోట్టెది.ప్రస్తుతం తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ మళ్ళీ సౌత్ సినిమావైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.తనకి మరోసారి ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ చూపిస్తానని ఇలియానా డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.అయితే ఇలియానాకు సౌత్ లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.

Show comments