NTV Telugu Site icon

Online Dating Fraud: ఆన్లైన్లో అమ్మాయిలతో డేటింగ్.. అడ్డంగా బుక్కైన యువకులు

Online Dating

Online Dating

మోసం చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా మారారు. ఎక్కడ చూసినా దోపిడీలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఇలా నేరం ఏదైనా రూటు మార్చుకొని చివరకు అమాయకులనే మోసం చేస్తున్నారు. ఎన్ని కేసులు విధించినా చేసే పని చేసుకుంటూనే వెళ్తున్నారు. తాజాగా ఒక కొత్త రకమైన దోపడీ వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ పేరుతో అమాయక అబ్బాయిలను మోసం చేస్తున్నారు అమ్మాయిలు. డేటింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకుని రిజిష్టర్‌‌‌‌ చేసుకుంటున్న యూత్​ అందంగా ఉన్న యువతులకు రిక్వెస్ట్‌‌‌‌లు పంపుతున్నారు. టెక్కీలైతే వెంటనే యాక్సెప్టెన్సీ వస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. రోజూ చాట్‌‌‌‌ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. రకరకాల కథలు చెబుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. వీటి వెనక ఉన్న ముఠాలు అమ్మాయిలను పంపుతామంటూ ముందుగా మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయించుకుని చీట్​ చేస్తున్నాయి. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని కంప్లయింట్‌‌‌‌ ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు.

Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టండి..!

తాజాగా.. ఓ పోష్ అమ్మాయితో డేటింగ్ చేసిన యువకుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయి కదా.. పెళ్లి చేసుకుందామని అనుకున్న యువకులు అడ్డంగా బుక్కయ్యారు. డేటింగ్ యాప్ మాయలో పడి రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి. ఇన్స్టాగ్రాంలో సైబర్ ముఠా వల విసిరింది. డేటింగ్, ప్రేమ, పెళ్లి యవ్వారం చాలా దూరం వెళ్లే సరికి అవతల నుంచి ఓ అమ్మాయి లైన్లోకి వచ్చింది. అవసరాలు పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.28 లక్షలు నొక్కేసింది. డబ్బులు పోయి మబ్బులు తొలిగే సరికి మోసపోయానని గుర్తించాడు ఆ బ్యాచిలర్. ఆ తర్వాత.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయిస్తే మోసగాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖకు చెందిన కృష్ణ మనోజ్ ఇంజనీర్ ను మోసం చేసినది సాయి ధీరజ్, లోకేష్, శాలినిగా గుర్తించారు. ఈ ముఠా అతని వద్ద నుంచి రూ. 28 లక్షల కాజేసినట్టు నిర్దారణ అయ్యింది. కాగా.. ఈ కేసులో లోకేష్ ను అరెస్టు చేయగా మిగిలిన ఇద్దరు పరారీలో వున్నారు. మరోవైపు.. ఫేస్ బుక్లో దినేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పరిచయం పెంచుకున్న సాయి ప్రియ అనే మహిళ.. అతని వద్ద నుంచి రూ. 21 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఈ రెండు కేసులను విశాఖ సైబర్ పోలీసులు ఛేదించారు.