ప్రేమ కోసం ఏదైనా చేస్తామన్నట్టుగా ఉంది కొందరి ప్రేమికుల తీరు. ఓ యువతి తన ప్రియుడిని కలిసేందుకు జైలుకెళ్లింది. ఆ ప్రియుడు డ్రగ్స్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న ప్రియురాలు జైలుకెళ్లింది. జైలులో ప్రియుడిని కలిసిన ప్రియురాలు రీల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Also Read:Under-19 World Cup 2026: 163 పరుగులతో నయా హిస్టరీ.. 17 ఏళ్ల ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్ విధ్వంసం
తర్కేశ్వర్ అనే యువకుడు డ్రగ్స్ కేసులో అరెస్టై రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని బర్త్ డే రోజున ఆశ్చర్యపర్చాలని ప్రేయసి భావించింది. జైలు అధికారుల అనుమతితో ప్రియుడ్ని కలిసింది. ప్రియురాలిని చూసిన ప్రియుడు ఆనందంలో మునిగిపోయాడు. అలాగే ఆ జైలులో రీల్ చిత్రీకరించింది. ఈ వీడియో క్లిప్‌ను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read:Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఆ యువతి వీడియో లో మాట్లాడుతూ.. ఈ రోజు నా జాన్ పుట్టినరోజు, నేను అతనిని కలవడానికి సెంట్రల్ జైలుకు వచ్చాను. అతని పుట్టినరోజున నేను అతనితో లేకపోవడం నాకు బాధగా ఉంది, కానీ నేను అతనిని కలవడానికి వచ్చినప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అని సోషల్ మీడియా వీడియోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ సెంట్రల్ జైలులో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
