NTV Telugu Site icon

Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం

Rape

Rape

Crime : మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాళ్లే ఓ బాలికపై కీచకుల్లా ప్రవర్తించారు. ఓ బాలికపై తండ్రి, తాత, అంకుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరేళ్లుగా ఆ బాలిక నరకం అనుభవిస్తోంది. ఇన్నాళ్లూ బయటకు చెప్పుకోలేక పోయింది. ఆమె బుధవారం విశాఖ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని అధికారులకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి ప్రస్తుతం పూణెలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Jharkhand CM Hemant Soren : ముగిసిన ఈడీ విచారణ.. 9గంటల తర్వాత బయటకు వచ్చిన సీఎం

2016, 2018 సంవత్సరాల్లో తాను యూపీ లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. అంకుల్ తో పాటు తన తాతయ్య వేధింపులకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. 2018లో పూణే వచ్చాక ఈ లైంగిక దాడి ఘటన గురించి తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చానని చెప్పింది. అయితే, అది చదివిన తండ్రి.. వారిపై చర్యలు తీసుకోకపోగా తల్లి లేని సమయంలో తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తండ్రి తో పాటు ఆమె అంకుల్, తాతయ్యలపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments