NTV Telugu Site icon

Suicide : బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

Suicide

Suicide

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఆమె స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్‌ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ గమనించారు. ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చుట్టుపక్కలవారిని పిలిచి చూడగా.. బాలిక అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు.