ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లలపై చదువుల పేరుతో ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, నాలుగు ఇలా తమకు వచ్చిన ర్యాంకులను ఆయా విద్యాసంస్థలు చెబుతూ ఉంటే తమ పిల్లలు కూడా ఇలాగే మార్కులు తెచ్చుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తు్న్నారు. మార్కులు రాకపోతే వారు వేస్ట్ అనే భావన ఉంటుంది. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నుంచి ఒత్తిడి ఉండటంతో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అయితే సున్నా మార్కుల వచ్చిన తన కూతురిపట్ల ఓ తల్లి చేసిన పని ప్రస్తుతం ప్రశంసలు పొందుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. జైనాబ్ అనే ఓ ఎక్స్(ట్విటర్) యూజర్ తాను ఆరవతరగతిలో ఉన్నప్పుడు తనకి గణితంలో 15 మార్కులకు సున్నామార్కులు వచ్చిన పేపర్ ను పంచుకుంది. అప్పుుడు వాళ్ల అమ్మకు ఆ పేపర్ ను చూపించి సంతకం తీసుకోవడానికి చాలా భయపడ్డాని తెలిపిన ఆమె వాళ్ల అమ్మ చేసిన పనికి షాక్ అయ్యానని తెలిపింది. దానిలో వాళ్ల అమ్మ చేసిన సంతకం ఇప్పుడు వైరల్ అవుతుంది. సున్నా మార్కులు వచ్చిన కూతురి మార్క్ లిస్ట్ లో ఆ తల్లి సంతకం చేస్తూ ఇలాంటి మార్కులు తెచ్చుకోవాలంటే దైర్యం ఉండాలి అని రాసింది. దీనిని షేర్ చేసిన యువతి చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ తనను ప్రతి విషయంలో ప్రోత్సహించేదని పేర్కొంది. ఇలాంటి అమ్మ ఉండటం లక్కీ అని తెలిపింది.ఇక దాని తరువాత గణితానికి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకున్నానని, ఇదంతా వాళ్ల అమ్మ ప్రోత్సహం వల్లే అని తెలిపింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు వాళ్ల అమ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారని అలాంటి వారందరికి ఇలాంటి అమ్మ ఉండాలని పేర్కొంటున్నారు. ఇలా ఎంకరేజ్ చేస్తే జీవితంలో ఎవరైనా ఎదుగుతారని మరికొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు మార్కులు ఇంట్లో వారికి చూపించాలంటేనే చాలా మంది పిల్లలు భయపడుతున్నారని చాలా మంది పేర్కొంటున్నారు. ఇది పిల్లలను మానసికంగా ఇబ్బంది పడేలా చేస్తుందని తెలుపుతున్నారు. మార్కులు కాకుండా పిల్లలకు ఏ విషయంలో ప్రతిభ ఉంటే ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon
— zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023