NTV Telugu Site icon

Tirumala: తిరుమల నడకమార్గంలో కలకలం.. చిన్నారిని చంపేసిన చిరుత

Tirumala

Tirumala

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కలకలం రేగింది.. తిరుపతి నుంచి తిరుమలకు నడక మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.. అప్పుడప్పుడు కొన్ని దురదృష్ట ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. ఈ మధ్యే ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది.. అయితే, ఆ బాలుడు ప్రాణాలతో భయటపడ్డారు. కానీ, తిరుమలలో తొలిసారి చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని చిరుత చంపేసింది.. అలిపిరి నడకమార్గంలో నిన్న రాత్రి బాలిక తప్పిపోయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్‌.. అయితే, ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులకు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బాలిక ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇవాళ ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారు..

Read Also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి

చిరుత దాడిలో బాలిక మృతిచెందిన ఘటన ఇప్పుడు తిరుమలలో కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనతో అలెర్ట్‌ అయిన టీటీడీ.. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లవెద్దని హెచ్చరించింది.. భక్తులు గుంపులుగా మాత్రమే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవాలని సూచించింది. మొత్తంగా ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడంలో తిరుమలలో విషాదాన్ని నిపిందింది.. నెల రోజుల క్రితమే ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది.. అదే ప్రాంతంలో ఇప్పుడు బాలికపై దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే, నడక మార్గంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలో చాలానే ఉన్నాయి.. కానీ, చిరుత దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విషాధాన్ని నింపింది.